CE20 Engine: శూన్య స్థితిలో క్రయోజనిక్ ఇంజన్ పరీక్ష సక్సెస్

అంతరిక్షంలో ఎలాంటి వాయువులు లేని శూన్య స్థితి మాత్రమే ఉంటుంది. లాంఛ్ వెహికల్ మార్క్(LVM3) వ్యో మనౌకలోని పైభాగాన్ని మరింత పైకి తీసుకెళ్లేందుకు దోహదపడే సీఈ20ను 7వ తేదీ విజయవంతంగా పరీక్షించామని ఇస్రో పేర్కొంది.
వ్యోమగాములతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గగన్‌యాన్ వంటి ప్రాజెక్టులో ఈ కొత్త విధానంతో క్రయోజనిక్ ఇంజన్లను సమర్థవంతంగా మండించవచ్చని ఇస్రో వెల్లడించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఉన్న హై ఆల్టిట్యూడ్ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్ష జరిపారు.
Chandrayaan-4: 2027లో చంద్రయాన్-4 మిషన్ లాంచ్
మార్గమధ్యంలో ఉన్నప్పుడు క్రయోజనిక్ ఇంజన్‌ను ట్యాంక్ ఒత్తిడి పరిస్థితుల్లో రీస్టార్ట్ చేసేందుకు, శూన్యంలో విభిన్న మూలకాలతో తయారుచేసిన ఇగ్నైటర్‌తో ఇంజన్‌ను మండించి చూశామని ఇస్రో పేర్కొంది. పరీక్ష ఫలితాలు అనుకున్న రీతిలో సాధారణంగా వచ్చాయని వెల్లడించింది.
క్రయోజనిక్ ఇంజన్‌ను రీస్టార్ట్‌చేయడం అనేది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. సంప్రదాయకమైన గ్యాస్ సిస్టమ్‌లో కాకుండా బూట్‌స్ట్రాప్ విధానంలో టర్బోపంప్‌లను ఉపయోగించి క్రయోజనిక్ ఇంజన్‌ను మళ్లీ మండించడం కష్టమైన పని. దీనిని ఇస్రో విజయవంతంగా చేసి చూపింది. ఈ ఇంజన్‌ను ఇస్రో వారి లికివ్‌డ్ ప్రొపల్షన్ సెంటర్ వారు అభివృద్ధిచేశారు.
ఈ విజయం ప్రపంచంలో కొత్త రికార్డులను నెలకొల్పబోతుందని, గత విఫలాలు సరికొత్త విజయాలతో మార్చినట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు.