Aero India: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. ‘ఏరో ఇండియా’ ప్రారంభం

ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీప యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదిక కానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధ విమానం రష్యా తయారీ ఎస్‌యూ–57, అమెరికాకు చెందిన ఎఫ్–35 లైట్నింగ్ 2 ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ వివరాలను ఫిబ్రవరి 9వ తేదీ రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం 42 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఇండియా కార్యక్రమంగా నిలవనుంది. ఈ ఎడిషన్‌ను ‘ది రన్ వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్’ అనే ఇతివృత్తంతో చేపట్టినట్లు రక్షణ శాఖ తెలిపింది.
ఇందులో 90 వరకు దేశాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని వివరించింది. సుమారు 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులతో పాటు మరో 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపింది.
Republic Day: కన్నుల పండువగా గణతంత్ర వేడుకలు.. నేటి హైలైట్స్ ఇవే..