Warner Bros Discovery: హైదరాబాద్‌కు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. వేల మందికి ఉపాధి
మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాభివృద్ధి, ఆవిష్కరణల విషయంలో ఇరువర్గాలు ఒకే విధమైన ఆశయాలను కలిగి ఉన్నట్టు ఈ చర్చల సందర్భంగా అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రంగాల ఉజ్వల భవిష్యత్‌కి కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
➤☛ న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజు ఔట్
వైవిధ్యభరిత కంటెంట్, బ్రాండ్స్, ఫ్రాంచైజీల ద్వారా టెలివిజన్, సినిమా, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి రంగాల్లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రపంచ ఖ్యాతి గడించింది. సంస్థ గొడుగు కింద ప్రపంచ ప్రఖ్యాత హెచ్‌బీఓ, హెచ్‌బీఓ మ్యాక్స్, సీఎన్‌ఎన్, టీఎల్‌సీ, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, ఈరోస్పోర్ట్, అనిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, నిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ వంటి ఎంటర్‌టైన్మెంట్ చానళ్లు పనిచేస్తున్నాయి.
హైదారాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారతీయ మార్కెట్‌లోని అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు నగర మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాలపై తనదైన ముద్ర వేయాలని వార్నర్ బద్రర్స్ డిస్కవరీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
➤☛ రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!
దేశంలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని ఐడీసీ వ్యూహాత్మక కేంద్రంగా సేవలందించనుంది. తొలి ఏడాది 1200 వృత్తి నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించనుంది. వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచుకోనుంది. స్థానిక నిపుణులను ప్రోత్సహించడం, హైదరాబాద్ నగరంలో మీడియా, వినోద రంగ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాడు అందించడంలో సంస్థ చిత్తశుద్ధికి ఈ నిర్ణయం నిదర్శనమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.