India Signs Trade Agreement With EFTA: భారత్, ఈఎఫ్‌టీఏ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
Sakshi Education
భారత్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ద్వారా భారతదేశానికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి.
![EFTA and India sign Trade and Economic Partnership Agreement](/sites/default/files/images/2024/03/11/india-signs-trade-agreement-1710149872.jpg)
ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్‌టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు.
- 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: ఈ ఒప్పందం వల్ల వచ్చే 15 ఏళ్లలో భారతదేశంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నట్లు అంచనా. దీని ద్వారా 10 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయి.
- సుంకాల తొలగింపు: ఈ ఒప్పందం ప్రకారం చాలా భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్‌టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు.
- వ్యవసాయ ఉత్పత్తులపై మినహాయింపులు: పలు ప్రాసెస్డ్ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి.
- సర్వీసు రంగంలో ప్రయోజనాలు: ఈ ఒప్పందం ద్వారా ఇరు పక్షాల సర్వీసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి.
- చౌకైన వస్తువులు: స్విస్ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్‌లో కొంత చౌకగా లభించగలవు.
- చట్టబద్ధత: లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్‌టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి.
- అమలు: ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది.
- ఈఎఫ్‌టీఏ దేశాలు: ఈఎఫ్‌టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్, లీచ్టెన్‌స్టెయిన్ దేశాలు ఉన్నాయి.
- ద్వైపాక్షిక వాణిజ్యం: 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఈఎఫ్‌టీఏ మధ్య 18.65 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది.
India-UAE Relations: బంధం బలపడుతోంది.. భారత్ - యూఏఈ సంబంధాలు ఇవే!!
Published date : 11 Mar 2024 03:07PM