Success Story: ఆ ఘటనతో బ్యాంకు జాబ్ వదిలేశా... మూడేళ్లపాటు వ్యవసాయంలో మెళకువలు నేర్చుకున్నా.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నానిలా
వినూత్న పద్ధతులతో సాగు చేస్తూ సిరులుకురిపిస్తున్నాడు. అతడే అమిత్ కిషన్. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపూర్ కు చెందిన అమిత్ కిషన్ పుట్టి పెరిగింది, పాఠశాల చదువు సాగించింది చిక్కబళ్ళాపూర్ లోనే. అమిత్ మంచి బ్యాంక్ ఉద్యోగం సంపాదించాడు. ఐసీఐసీఐ, బజాజ్, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులలో పనిచేశాడు.
చదవండి: అమెరికాలో అదరగొడుతున్న భారతీయ మహిళ... వందల కోట్ల వ్యాపారంతో పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న జోయా
ఈ క్రమంలో అమిత్ దగ్గర ఇన్సురెన్స్ చేసిన ఒక క్లయింట్ క్యాన్సర్ తో మరణించాడు. ఆ సంఘటన అమిత్ లో బలమైన ముద్ర వేసింది. 'డబ్బు సంపాదించుకుంటున్నాం కానీ, ఎంత నాణ్యత కలిగిన ఆహారం తింటున్నాం?' అనే ప్రశ్న అతన్ని వేధించడం మొదలుపెట్టింది. దీంతో అతను ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. తన తాత ఊరైన చిక్కబళ్ళాపూర్ లో వారికున్న పొలంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. మూడేళ్ల పాటు వ్యవసాయం గురించి తెలుసుకోవడంలోనే గడిపారు.
చదవండి: వయసు 11.. యూ ట్యూబ్ వీడియోలతో వందల కోట్ల సంపాదన... ఈ చిన్నారి ఎవరో తెలుసా
అన్నీ మెళకువలు తెలుసుకున్న తర్వాత సేంద్రియ వ్యవసాయం చేయాలనే సంకల్పంతో అడుగు ముందుకేశాడు. అయితే ఇది అనుకున్నంత సులభమేమీ కాదు. కానీ, దీని కోసం భూమిని నాలుగు అడుగులు తవ్వి అందులో రసాయనాలకు బదులు ఆవు పేడ, మూత్రం వంటి వాటితో పాటు అరటిపండు తొక్కలు కూడా వేసాడు. ఈ ఆలోచన చాలా బాగా సక్సెస్ అయింది. భూమిని సారవంతం చేయడంలో ఇది చాలా ఉపయోగపడింది.
చదవండి: ఒకే ఒక్క ఆలోచన... ఐదేళ్లకు వేల కోట్ల అధిపతిని చేసింది... అంకిత భాటి సక్సెస్ జర్నీ ఇదే
సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించిన భూమిలో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. ప్రారంభంలో రూ. 1.5 కోట్లతో సుమారు 15 ఎకరాల భూమితో ప్రారంభమైన వీరి వ్యవసాయం ఇప్పుడు ఏకంగా 600 ఎకరాలకు విస్తరించింది. వీరి పొలాల్లో ఉపయోగించడానికి సేంద్రియ ఎరువుల కోసం ఆవులు, గేదెలను కూడా వారే పెంచుతున్నారు.
చదవండి: 2.5 కోట్ల వేతనాన్ని వదిలేసి... సొంతంగా స్టార్టప్ స్థాపించి... 23 ఏళ్లకే కోట్లకు అధిపతి అయిన కన్హయ్య శర్మ సక్సెస్ జర్నీ
ఒక పక్క సేంద్రియ వ్యవసాయం, మరో వైపు పాల వ్యాపారం బాగా సాగింది. వీరి వ్యాపారానికి హెబ్పేవు ఫామ్స్, హెబ్పేవు సూపర్ మార్కెట్ అని పేరు పెట్టారు. వ్యవసాయం బాగా విస్తరించిన తరువాత వార్షిక ఆదాయం రూ.21 కోట్లకు చేరింది. వీరి వ్యవసాయ క్షేత్రంలో 3000 మందికిపైగా మహిళలు పనిచేస్తున్నారు. హెబ్పేవు ఉత్పత్తులు బెంగళూరు వంటి నగరాల్లో విరివిగా అమ్ముడవుతున్నాయి.