Youtuber Shfa Success Story: వయసు 11.. యూ ట్యూబ్ వీడియోలతో వందల కోట్ల సంపాదన... ఈ చిన్నారి ఎవరో తెలుసా
అలాంటి వారిలో ఒకరు 11 సంవత్సరాల 'ష్ఫా' (Shfa). ఇంతకీ ఈమె యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తోంది. ఎలాంటి వీడియోలు చేస్తుంది అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చదవండి: ఒకే ఒక్క ఆలోచన... ఐదేళ్లకు వేల కోట్ల అధిపతిని చేసింది... అంకిత భాటి సక్సెస్ జర్నీ ఇదే
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో 2011 డిసెంబర్ 19న జన్మించిన 'ష్పా' (Shfa) పిల్లలకు ఉపయోగకరమైన ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పోస్ట్ చేసి అతి తక్కువ కాలంలో పాపులర్ అయిపోయింది. ఈ అమ్మాయి వీడియోలు అరబిక్ భాషలో ఉండటం గమనార్హం.
ష్ఫా యూట్యూబ్ ఛానల్ పాలొవర్స్..
సుమారు 40 మిలియన్స్ పాలొవర్స్ ఉన్న 'ష్ఫా' యూట్యూబ్ ఛానల్ 2015 మార్చి 29 నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. అంతే కాకుండా ఇది మొదట్లో తన తల్లి నిర్వహించేది, అయితే ష్ఫా యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించిన తరువాత ఎంతో మంది పిల్లల హృదయాలను దోచుకుంది, తద్వారా ఈ ఛానల్ బాగా డెవలప్ అయింది.
చదవండి: ట్యూషన్లు చెప్పడంతో ప్రారంభించి... యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ... వేల కోట్లకు అధిపతైన అలఖ్ పాండే సక్సెస్ జర్నీ
నెల సంపాదన ఎంతంటే..
ష్ఫా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి 22 బిలియన్లకు పైగా వీక్షణలను పొందింది, ఫలితంగా రాబడి భారీగా పెరిగింది. 2023 మే నాటికి వీరి ఛానల్ ఆదాయం 2,00,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం, రూ. 1 కోటి కంటే ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఆమె నెల సంపాదన 3,00,000 డాలర్లు కూడా దాటింది.
కేవలం ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే 984 వీడియోలను అప్‌లోడ్ చేసి సంపాదనలో బిలియన్ డాలర్ మార్క్‌కు చేరుకుంది. ష్పా నికర సంపాదన విలువ 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అంటే సుమారు 410 కోట్లు. కేవలం 11 సంవత్సరాల వయసులోనే కోట్లు సంపాదిస్తున్న ఈ చిన్నారి ఎంతోమందికి ఆదర్శం కావడం చాలా గొప్ప విషయం.