YouTuber Alakh Pandey: ట్యూషన్లు చెప్పడంతో ప్రారంభించి... యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ... వేల కోట్లకు అధిపతైన అలఖ్ పాండే సక్సెస్ జర్నీ
కట్ చేస్తే కేవలం ఐదేళ్లలోనే నాలుగు వేల కోట్ల నెట్ వర్త్ ఉన్న వ్యాపారానికి అధిపతి అయ్యాడు. అతనే అలఖ్ పాండే. అతని సక్సెస్ జర్నీ మీకోసం...
Rajinder Gupta: రోజుకు రూ.30తో ప్రారంభించి... నేడు రూ.12 వేల కోట్లకు అధిపతి... రాజేందర్ గుప్తా సక్సెస్ జర్నీ..!
అలఖ్ పాండే 1991, అక్టోబరు 2న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించాడు. స్థానికంగా ఉన్న బిషప్ జాన్సన్ స్కూల్ అండ్ కాలేజ్ (2010)లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 2011లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని హర్ కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ లో జాయిన్ అయ్యాడు. అయితే అలఖ్‌కు ఫిజిక్స్ పట్ల ఇష్టం. దీంతో అయిష్టంగానే మెకానికల్ చదవడం ప్రారంభించాడు. చివరికి తన వల్లకాక థర్డ్ ఇయర్‌లో కాలేజీ మానేశాడు.
అలఖ్ తండ్రి సతీష్ పాండే ప్రైవేట్ కాంట్రాక్టర్ గా పనిచేసేవాడు. తల్లి రజత్ పాండే ఉత్తరప్రదేశ్ లోని విష్ణు భగవాన్ పబ్లిక్ స్కూల్ లో టీచర్ గా పనిచేసేవారు. అతని సోదరి అదితి పాండే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది. అయితే అలఖ్ చిన్నతనంలో తన తండ్రి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటిలోని కొంత భాగాన్ని విక్రయించారు. తర్వాత పిల్లల చదువుకోసం మిగిలిన ఇంటిని అమ్మేసి, ఓ చిన్న అద్దె ఇంట్లోకి మకాం మార్చారు.
Record Breaking Salary: అత్యధిక వేతనంతో అదరగొట్టిన షాప్ కీపర్ కొడుకు... కోట్ల ప్యాకేజీలతో ఆదర్శంగా నిలుస్తున్న కుర్రాళ్లు
చిన్ననాటి నుంచే ఆర్థికంగా కష్టాలు ఉండడంతో కుటుంబానికి తన వంతుగా సాయం చేయాలని అలఖ్ ఆలోచించేవాడు. దీంతో తన 11వ తరగతి నుంచి ట్యూషన్ చెప్పడం ప్రారంభించాడు. అక్కడ నెలకు రూ.5000 జీతం వచ్చేది. అక్కడ కొన్నాళ్లు పనిచేసిన తర్వాత విద్యార్థులకు ఆఫ్లైన్ క్లాసుల రీచ్ తక్కువగా ఉందని గ్రహించాడు. 2016లో ఒక యూట్యూబ్ చానెల్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. దీని ద్వారా విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ తరగతులను అందించవచ్చని భావించాడు. తన చానెల్ కు ఫిజిక్స్ వాలాహ్ - అలాఖ్ పాండే అని పేరు పెట్టాడు. చానెల్ లో భౌతికశాస్త్రంపై ఉపన్యాసాలను అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు.
Kanhaiya Sharma Success Story: 2.5 కోట్ల వేతనాన్ని వదిలేసి... సొంతంగా స్టార్టప్ స్థాపించి... 23 ఏళ్లకే కోట్లకు అధిపతి అయిన కన్హయ్య శర్మ సక్సెస్ జర్నీ
ప్రారంభంలో అతని వీడియోలకు కేవలం కొన్ని వ్యూస్ మాత్రమే వచ్చేవి. దీంతో చానల్‌ను డెవలప్ చేయడానికి కంటెంట్ నాణ్యతను పెంచాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం రాజస్థాన్లోని కోటా నుంచి స్టడీ మెటీరియల్ను కొనుగోలు చేసి, దాన్ని తన రీతిలో చెప్పడం ప్రారంభించాడు. ఇది సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. మెల్లమెల్లగా అతని వీడియోలకు వ్యూస్ ఎక్కువ రావడం మొదలైంది.
2018లో 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి, ఐఐటీ జేఈఈ/నీట్ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను తన మొబైల్ యాప్ ఫిసికా వాలా ద్వారా అందించారు. యాప్ ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 35 వేల మందికి పైగా విద్యార్థులు యాప్ లో ఉన్న కోర్సుల్లో చేరారు. దీంతో 2022లో రాజస్థాన్లోని కోటాలో అలఖ్ విద్యా సంస్థను ప్రారంభించారు.
విద్యా సంస్థను ప్రారంభించడంతో పాటు వీడియోలను మరిన్ని సబ్జెక్టులకు అలఖ్ విస్తరించాడు. ఎంబీఏ వాలా, గేట్ వాలా, టీచింగ్ వాలా లాంటి పేర్లతో వీడియోలు తన చానల్‌లో అప్‌లోడ్ చేయడం మొదలు పెట్టాడు. వీడియోలతో పాటు మోటివేషనల్ స్వీచ్ ఇచ్చేవాడు. అలా డిసెంబర్ 2022 నాటికి, అతని యూట్యూబ్ చానెల్ ఫిజిక్స్ వాలా 9.25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది.
Ananth Narayanan success story: మింత్రా సీఈఓ పదవిని వదిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ సక్సెస్ జర్నీ
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.780 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని అలఖ్ ముందుకు సాగుతున్నాడు. అలఖ్ పాపులారిటీని చూసి ఓ కంపెనీ రూ.40 కోట్ల జాబ్ ఆఫర్ చేసింది. కానీ, దాన్ని సున్నితంగా తిరస్కరించిన అలఖ్.. తన స్టార్టప్‌కు 1.1 బిలియన్ డాలర్ల (రూ.9,000 కోట్లు)ను సమీకరించాడు. ఇప్పుడు ఎడ్-టెక్ స్పేస్ లో లాభదాయకంగా ఉన్న ఏకైక యూనికార్న్ ఇది మాత్రమే.