IPS Success Story: ఇంజినీరింగ్ నుంచి ఐపీఎస్ అధికారిగా.. రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్ ఎలా సాధించిందంటే...
మరికొంతమంది కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటుంటారు. ఇందుకోసం పకడ్బందీగా ప్రణాళిక బద్ధంగా చదువుతారు. ఒకటి, రెండు ప్రయత్నాల్లోనే తాము అనుకున్నది సాధించేస్తారు. అలాంటి వారిలో ఒకరే ఐపీఎస్ అన్షికా వర్మ.
IAS Success Story: వరుసగా మూడు సార్లు ఫెయిల్.. తర్వాత ఐఆర్ఎస్.. దాని తర్వాత ఐఎఫ్ఎస్.. ఆ తర్వాత ఐఏఎస్
ఇంజినీరింగ్ అయిపోగానే ఆమె సివిల్స్ వైపు అడుగులేసింది. కేవలం రెండో ప్రయత్నంలోనే తన 22 ఏళ్ల వయసులో ఐపీఎస్‌గా ఎంపికై తనకంటూ ఓ చరిత్ర లిఖించుకుంది. అన్షికా చదువు, ఫ్యామిలీ డీటైల్స్ మీ కోసం...
రెండో ప్రయత్నంలో...
అన్షికా శర్మ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందినవారు. 2020లో ఎలాంటి కోచింగ్ లేకుండానే రెండో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది అన్షిక. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఏడాది తర్వాత 2019లో ఆమె తొలి ప్రయత్నం చేశారు. ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిలవడంతో రెండో ప్రయత్నంలో తాను అనుకున్నది సాధించింది అన్షిక.
IAS Success Story: 15 ఏళ్లకే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ సక్సెస్ స్టోరీ
విద్యాభ్యాసం ఇలా...
నోయిడాలో ప్రాథమిక విద్యను అభ్యసించిన అన్షిక 2014 నుంచి 2018 వరకు నోయిడాలోని గాల్గోటియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో B.Tech పూర్తి చేసింది.
యూపీఎస్సీ వైపు...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ఆమె ప్రయాణం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ నుంచి ప్రారంభమైంది. ప్రిపరేషన్ ప్రారంభించినప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంది. సబ్జెక్ట్‌లు ఏంటో కూడా ఆమెకు తెలీదు. ఎలా ప్రిపరేషన్ మొదలుపెట్టాలో అనుభవం లేదు. ఇలాంటి సవాళ్లను ఆమె అధిగమించి.. రెండో ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 136వ ర్యాంకు సాధించింది.
IAS Anju Success Story: పది, ఇంటర్‌లో ఫెయిలయ్యా... ఈ అపజయాలే 22 ఏళ్లకే ఐఏఎస్‌ను చేశాయ్...
ఫ్యామిలీ వివరాలు...
అన్షికది ఉన్నత మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీఈఎల్) లో ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యారు. తల్లి గృహిణి. కుటుంబ ప్రోత్సాహంతోనే రెండో ప్రయత్నంలో విజయం సాధించగలిగానని గర్వంగా చెబుతుంది అన్షిక.
సోషల్ మీడియాలోనూ...
వృత్తిపరమైన విజయాలతో పాటు.. అన్షిక సోషల్ మీడియాలో కూడా ఫేమస్. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 198కే ఫాలోవర్స్ ఉన్నారు. ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె యూపీ కేడర్‌కు కేటాయించారు. 2021లో ఆమె తన తొలి పోస్టింగ్ సాధించారు.
Civils Toppers: రెండేళ్లపాటు మంచంలోనే... పట్టుదలతో చదివి సివిల్స్‌లో మెరిసింది... ఈమె కథ వింటే కన్నీళ్లే
ఐపీఎస్ అన్షికా శర్మ ఇంజనీర్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ప్రయాణం, ఆమె సంకల్పం, కృషి పదిమందికి ఆదర్శం. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కలలను సాకారం చేసుకోవచ్చని నిరూపించిన ఆమె సక్సెస్ జర్నీ.. ఔత్సాహిక ప్రభుత్వోద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.