CEO Success Story: ఇన్ఫోసిస్‌లో ఆఫీసుబాయ్... కట్ చేస్తే ఇప్పుడు రెండు కంపెనీలకు సీఈఓ... పీఎం మోదీ నుంచి ప్రశంసలు.!
ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన భగత్ ఇప్పుడు తన సొంత స్టార్టప్‌లకు సీఈఓగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలందుకున్నారు.
ఇవీ చదవండి: కూలీనాలీ చేసుకుంటూ చదువుకున్నా.. ఇప్పుడు గర్వంగా పీహెచ్‌డీ సాధించా...
దాదాసాహెబ్ భగత్ ఎవరు?
మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన దాదాసాహెబ్ భగత్ 1994లో జన్మించారు. స్థానికంగా పదో తరగతి వరకు చదువుకున్న తర్వాత.. పూణేలో ITI డిప్లొమా పూర్తి చేశాడు. తర్వాత కుటుంబ పోషణ కోసం, తన ఖర్చుల కోసం రూం సర్వీస్ బాయ్‌గా చేరాడు. అక్కడ నెలకు రూ.9వేలు ఇచ్చేవారు. కొద్దిరోజుల అక్కడ చేసిన తర్వాత దాన్ని వదిలేసి ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు చెందిన గెస్ట్‌హౌజ్‌కి పనికి కుదిరాడు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
ఇవీ చదవండి: పరిస్థితులను ఎదురించి పేదరికాన్ని జయించా... నా సక్సెస్ జర్నీ సాగిందిలా..!
ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో అతిథులకు రూమ్ సర్వీస్, టీ, వాటర్ అందించడం భగత్ డ్యూటీ. ఇక్కడే సాఫ్ట్‌వేర్ విలువను తెలుసుకుని పరిశ్రమపై ఆసక్తి పెంచుకున్నారు. కార్పొరేట్ ప్రపంచం పట్ల ఆకర్షితుడయ్యారు. యానిమేషన్ అండ్ డిజైన్‌ను చేయాలన్నపెద్దల సలహా మేరకు రాత్రి ఉద్యోగం, పగటిపూట యానిమేషన్‌లో చదువును కొనసాగించాడు. కోర్సు పూర్తి చేసిన భగత్ ముంబైలో ఉద్యోగంలో చేరి, కొంతకాలం తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
అనుకోని ప్రమాదం, మంచానికే పరిమితం
హైదరాబాద్‌లోని ఓ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే పైథాన్, C++ కోర్సులు నేర్చుకున్నాడు. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌పై దృష్టి పెట్టాడు. డిజైన్ టెంప్లేట్‌లను తయారుచేసి వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించడం ప్రారంభించాడు. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో భగత్ మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా భయపడకుండా 2015లో Ninthmotion స్టార్టప్‌ను ప్రారంభించాడు. బీబీసీ స్టూడియోస్, 9XM మ్యూజిక్ చానల్ వంటి ప్రముఖ కంపెనీలకు సేవల్ని అందిస్తూ, తక్కువ వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది క్లయింట్‌లను సాధించాడు.
ఇవీ చదవండి: నాలుగో ప్రయత్నంలోనే ఐపీఎస్... ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్...
భగత్ వ్యాపారాన్ని కోవిడ్ తీవ్రంగా దెబ్బతీసింది. వేరే గత్యంతరంలేక పెట్టాబేడా సర్దుకుని ఇంటికి రావాల్సి వచ్చింది. అయితే అప్పటికే గ్రాఫిక్ డిజైనింగ్ లో మంచి పట్టుఉండడంతో.. ఔత్సాహికుల కోసం ఆన్‌లైన్‌లో గ్రాఫిక్ డిజైనింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా పుట్టుకొచ్చిందే డూ గ్రాఫిక్స్..'Canva'. ఇది భగత్ రెండవ సంస్థ. ఇది సులభంగా టెంప్లేట్లను, ఆకర్షణీయమైన డిజైన్లను సృష్టించడానికి ఉపయోగపడుతుంది.
ఇవీ చదవండి: ప్రభుత్వ బడుల్లో చదువుకుని మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించా... దివ్య తన్వర్ సక్సెస్ జర్నీ సాగిందిలా
ఇండియన్ 'కాన్వా' ప్రారంభం
తన గ్రామంలోనే స్టార్టప్ ప్రారంభించి.. తన స్నేహితులకే యానిమేషన్ అండ్ డిజైన్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇలా కేవలం ఆరు నెలల్లో 10వేల క్రియాశీల వినియోగదారులను సాధించాడు. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగళూరుతోపాటు జపాన్, ఆస్ట్రేలియా, యూకే నుంచి క్లయింట్లను సాధించాడు. భగత్ సాధించిన విజయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించడంతో అతని విజయం దేశమంతటికి తెలిసింది.