IAS Success Story: ప్రభుత్వ బడుల్లో చదువుకుని మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించా... దివ్య తన్వర్ సక్సెస్ జర్నీ సాగిందిలా
దివ్యతన్వర్ 1997లో హర్యాణలోని దేవేంద్రఘడ్‌లో జన్మించింది. దివ్యకు 15 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. అప్పటినుంచి ముగ్గురు కూతుళ్ల బాధ్యతను తల్లి బబిత తీసుకుంది. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించింది.
దివ్యతన విద్యాభ్యాసమంతా మహేంద్రఘడ్ లోని నవోదయ విద్యాలయంలో సాగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. తర్వాత సిస్రాలోని చౌదరిదేవిలాల్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎంఏ పూర్తి చేసింది.
ఇవీ చదవండి: నాలుగో ప్రయత్నంలోనే ఐపీఎస్... ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్... నా సక్సెస్ జర్నీ ఇదే
చదువు పూర్తయిన తర్వాత కుటుంబానికి తనవంతు చేయూతనందించేందుకు నిశ్చయించుకుంది. దీంతో స్థానికంగా టీచర్‌గా జాయినయ్యింది. అలా పిల్లలకు చదువు చెబుతూనే తాను సొంతంగా యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యేది. ప్రతిరోజు 10 గంటల పాటు చదువుతూనే ఉండేది.
అలా 24 ఏళ్ల వయసులో దివ్య... 2021లో మొదటిసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసింది. మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ 438 సాధించింది. తనకు వచ్చిన ర్యాంకుకు ఐపీఎస్ కేడర్ దక్కింది.
ఇవీ చదవండి: ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్‌లో ఫెయిల్... సెకండ్ అటెంప్ట్‌లో రెండో ర్యాంకు సాధించానిలా...
ఐపీఎస్ శిక్షణ తీసుకుంటూనే 2022లో రెండో సారి మళ్లీ పరీక్ష రాసింది. ఈ సారి ఏకంగా 105 ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికైంది. దిగువ మధ్యతరగతి కుంటుంబంలో పుట్టిన తనలాంటి ఎంతోమందికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
దివ్య తన్వర్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రమ్‌లో లక్ష మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. తనలా పేద కుటుంబంలో పుట్టి, ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి ఆమె ఉచితంగా మోటివేషన్ ఇస్తుంటారు. తన చిన్ననాటి నుంచి విద్యాభ్యాసమంతా ప్రభుత్వ బడుల్లోనే సాగిందని చెబుతుంది దివ్య. పక్కా ప్లానింగ్‌తో చదివితే సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చని దివ్య విజయగాథను చూస్తే తెలుస్తుంది.