Woman Taxi driver Kiran Kurmawar: పరిస్థితులను ఎదురించి పేదరికాన్ని జయించా... నా సక్సెస్ జర్నీ సాగిందిలా..!
ఎక్కడో గడ్చిరోలి జిల్లాలోని రేగుంట అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన ఓ సాధారణ అమ్మాయి లండన్‌లోని ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించి పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఇవీ చదవండి: ప్రభుత్వ బడుల్లో చదువుకుని మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించా... దివ్య తన్వర్ సక్సెస్ జర్నీ సాగిందిలా
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని రేగుంట అనే చిన్న గ్రామం కిరణ్ కుర్మావర్ స్వస్థలం. 500 మంది జనాభా ఉండే అతి చిన్న గ్రామం అది. తండ్రి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. కిరణ్‌కు ఇద్దరు అక్కలు. ఉన్నంతలో ఆ తండ్రి ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేశాడు. చివరమ్మాయి కిరణ్‌ను మంచిగా చదివించాలనుకున్నాడు.
స్థానికంగా పాఠశాల విద్య పూర్తి చేసిన కిరణ్.. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎంఏ ఎకనామిక్స్ పూర్తిచేంది. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో తండ్రికి ప్రమాదం జరగడంతో.. కుటుంబ భారమంతా కిరణ్ పైనే పడింది. దీంతో ఉద్యోగం వదిలేసి తండ్రి నడిపే ట్యాక్సీ నే తన ఉపాధి మార్గంగా ఎంచుకుంది.
ఇవీ చదవండి: నాలుగో ప్రయత్నంలోనే ఐపీఎస్... ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్...
రోజూ రేగుంట నుంచి సిరోంచా వరకు దాదాపు 75 కిలోమీటర్ల దూరం ట్యాక్సీ నడిపేది కిరణ్. కొండ ప్రాంతపు రహదారి కావడంతో ట్యాక్సీ నడపడం కూడా సవాలుగా మారేది. మరోవైపు నక్సలైట్ల భయం! అయినా సరే.. మరో రెండు ట్యాక్సీలను అద్దెకు తీసుకొని.. ఇద్దరు డ్రైవర్లను పనిలో పెట్టుకుంది. కొన్ని నెలల తర్వాత తన తండ్రి కోలుకుని తిరిగి పనిలోకి రావడంతో.. తన చదువుపై పూర్తి దృష్టి సారించిందామె. ఈ క్రమంలోనే విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునేందుకు ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటికి సన్నద్ధమవడం ప్రారంభించింది.
ఇవీ చదవండి: కూలీనాలీ చేసుకుంటూ చదువుకున్నా.. ఇప్పుడు గర్వంగా పీహెచ్‌డీ సాధించా...
అలా ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (IELTS) పరీక్షలో కిరణ్ ఉత్తీర్ణత సాధించడంతో యూకేలోని ప్రతిష్టాత్మక లీడ్స్ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్’లో ఎమ్మెస్సీ చదువుకునే అరుదైన అవకాశమొచ్చింది. కిరణ్ కష్టాలు, పట్టుదలను గుర్తించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ. 40 లక్షల స్కాలర్‌షిప్ మంజూరు చేశారు.