Skip to main content

Job Opportunity: ప్ర‌ముఖ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం..శాల‌రీ ఎంతంటే..?

గణపవరం(పశ్చిమగోదావరి): గ్రామీణ నేపథ్యం కలిగిన గణపవరం చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని రెండు బహుళజాతి కంపెనీల క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరై రెండు కంపెనీల్లో ఉద్యోగం సాధించింది.
బాలం రుచితాదేవి
బాలం రుచితాదేవి

ప్రిన్సిపల్‌ శ్యాంబాబు తెలిపిన వివరాల ప్రకారం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న బాలం రుచితాదేవి ఇటీవల బహుళజాతి సంస్థలు నిర్వహించిన ఆన్‌లైన్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరైంది, నాలుగు రౌండ్లలో జరిగిన రాత, ముఖాముఖి పరీక్షలలో విజయం సాధించి యాస్సెంచర్, క్యాప్‌జెమిని సంస్థలలో ఏడాదికి దాదాపు రూ.3.50 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించింది.

గుమాస్తా.. కుతురికి జాక్‌పాట్ .. రూ.44 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ..
ఈ విద్యార్థిని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ తమ కళాశాలలో ఇచ్చిన శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. విద్యార్థిని రుచితను కాలేజి అభివృద్ది కమిటి అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ మధురాజు, న్యాక్‌ కోఆర్డినేటర్‌ అక్కిరాజు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అఫీసర్‌ డివివి చినసత్యనారాయణ, రసాయనశాస్త్ర అధ్యాపకులు శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.

Warren Buffett: కటిక పేదరికాన్ని చూశా.. ఆకలి కేకలు పెట్టా.. మీ గుడ్ ఫ్యూచర్‌కు నా సలహా ఇదే..

Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

Success Story : మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్‌..నాడు చాలా కష్టం అన్నవాళ్లే నేడు..

Published date : 12 Apr 2022 03:02PM

Photo Stories