గుమాస్తా.. కూతురికి జాక్‌పాట్ .. రూ.44 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సింహాచలం, సుభాసితిల కుమార్తె కొంచాడ స్నేహకిరణ్ అనే విద్యార్థిని విశాఖపట్నంలోని అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
గుమాస్తా కూతురు..
ఈ కళాశాలలో అమెజాన్ సంస్థ 2021 డిసెంబర్‌లో క్యాంపస్ సెలక్షన్ నిర్వహించింది. అందులో స్నేహకిరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.44 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. ఇదిలా ఉండగా, విద్యార్థిని తండ్రి జీడిపప్పు పరిశ్రమలో గుమాస్తాగా పనిచేస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని స్నేహకిరణ్ నిరూపించింది. కూతురు సాధించిన విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Warren Buffett: కటిక పేదరికాన్ని చూశా.. ఆకలి కేకలు పెట్టా.. మీ గుడ్ ఫ్యూచర్‌కు నా సలహా ఇదే..
Success Story: పెట్టుబడి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..
Success Story : మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్..నాడు చాలా కష్టం అన్నవాళ్లే నేడు..