Degree Results: డిగ్రీ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులు
కామారెడ్డి టౌన్: తెలంగాణ యూనివర్సిటీ పరిధి డిగ్రీ ఫలితాల్లో ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎస్ నికిత బయోటెక్నాలజీ రెండో సంవత్సరంలో 9.88 జీపీఏ మార్కులు సాధించి యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకును సాధించింది. అలాగే బీకాం ఫస్ట్ ఇయర్‌లో శివాంజలి 9.56, బీఎస్సీ డేటా సైన్స్ సెంకండ్ ఇయర్‌లో మానస 9.56, బీఎస్సీ హానర్స్‌లో శివగణేష్ ఫస్ట్ ఇయర్‌లో 9.56 జీపీఏ మార్కులు సాధించారు. అలాగే సృజన, సాయి శిరీష, మనీషా, పూజిత ఉత్తమ మార్కులు సాధించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల సీఈవో జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ దత్తాద్రి, లెక్చరర్లు అభినందించారు.
INSPIRE: రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక
విశిష్ట కళాశాల విద్యార్థుల సత్తా..
వశిష్ట కళాశాల విద్యార్థులు సలేహా మతీన్ 9.60, అస్మా, సల్మాఫాతిమా 9.56, జావేరియా, నిధాలు 9.52 జీపీఏ మార్కులు సాధించి ప్రతిభ చాటారు. విద్యార్థులను కళాశాల యజమాన్యం, అధ్యాప కులు అభినందించారు.
Walk-in Interviews: వైద్య కళాశాలలో ఈ పోస్టులకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు