Skip to main content

INSPIRE: రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక

ఇటీవలె జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపికైంది. ఆ విద్యార్థులు, పాఠశాల వివరాలను వెల్లడించారు జిల్లా సైన్స్‌ అధికారి గిరజాల వీఎస్‌ సుబ్రహ్మణ్యం. వివరాలు..
Officers presenting appreciation and memento to Student Praveen

అమలాపురం టౌన్‌: జాతీయ స్థాయి సైన్స్‌ ఇన్‌స్పైర్‌ పోటీలకు జిల్లా నుంచి ఒక ప్రాజెక్టు ఎంపికైనట్లు జిల్లా సైన్స్‌ అధికారి గిరజాల వీఎస్‌ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అమలాపురం మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి నక్కా సత్య ప్రవీణ్‌ రూపొందించిన ‘ప్లాంట్‌ గ్రొయింగ్‌ మెషీన్‌’ అనే ప్రాజెక్ట్‌ జాతీయ స్థాయికి ఎంపికైందన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకూ జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీల్లో సత్య ప్రవీణ్‌కు ప్రాజెక్టుకు అభినందనలు లభించాయన్నారు.

Walk-in Interviews: వైద్య కళాశాలలో ఈ పోస్టులకు వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు

విద్యార్థితో పాటు గైడ్‌ చేసిన ఉపాధ్యాయుడు చంద్రారెడ్డిని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి.నాగమణి, జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ మధుసూదనరావు, ఉప విద్యాశాఖాధికారి ఎస్‌.నరసింహఫణి, ఉమ్మడి జిల్లా పరీక్షల అధికారి హనుమంతరావు, జిల్లా విద్యాశాఖ ఏడీలు సురేష్‌, విజయలక్ష్మి అభినందించారన్నారు. అలాగే అమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌, మహత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీఆర్‌ కామేశ్వరరావులు విజేత విద్యార్థి, గైడ్‌ టీచర్‌ను అభినందించారు.

Stratigraphic Column: ఆంధ్రప్రదేశ్‌లో స్ట్రాటిగ్రాఫిక్ కాలమ్.. ఎక్క‌డంటే..

కాకినాడ జిల్లా నుంచి మరొకటి..

బాలాజీచెరువు: జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీలకు జిల్లా నుంచి ఒకే ఒక ప్రాజెక్టు ఎంపికైంది. కాకినాడ అర్బన్‌ గొడారిగుంట మున్సిపల్‌ ఉన్నత పాఠశాల నుంచి గుత్తుల అనుష్క రూపొందించిన సీడర్‌ ఫర్‌ స్మాల్‌ స్కేల్‌ ఫార్మర్స్‌ ప్రాజెక్టు ఈ ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 11 నుంచి 13 వరకూ చిత్తూరులో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించగా 240 ప్రాజెక్టులు అన్ని జిల్లాల నుంచి పాల్గొనగా ఇందులో 24 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని అనుష్క, గైడ్‌ చంద్రా రెడ్డిని పాఠశాల ఆర్‌జేడీ నాగమణి, జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌, డీవైఈఓ డానియల్‌, జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌ వినీల్‌ అభినందించారు.

Candidates for Inter 1st Year Exams: పరీక్షకు 17,802 మంది ఇంటర్‌ విద్యార్థులు హాజరు

 

                                                Sakshi
Published date : 14 Mar 2024 05:20PM

Photo Stories