Research Program: స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్‌షిప్ కు ఎంపికైన వైద్య విద్యార్థులు
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయి పరిశోధనలకు కర్నూలు మెడికల్ కాలేజి వైద్య విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ డాక్టర్ పి.సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య విద్యార్థులలో పరిశోధనా ఆసక్తిని పెంపొందించడం కోసం డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడ వారు స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్‌షిప్ అనే ప్రోగ్రామ్‌ను 2021లో ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 2023 సంవత్సరానికి గాను కర్నూలు వైద్య కళాశాల నుంచి వివిధ రకాల పరిశోధనలకు గాను నలుగురు వైద్య విద్యార్థులు ఎంపికయ్యారన్నారు.
ANM Training Courses: కోర్సుల అవకాశం.. మహిళలకు మాత్రమే
అందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎం. సాయిప్రణీత్, కె. అనూష, వి. స్నేహిత, బి. నవీన్‌రెడ్డి ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు మరింత ఆసక్తితో రోగనివారణ, చికిత్సలకు ఉపయోగపడే దిశగా ఆవిష్కరణలకు ప్రయత్నించాలని సూచించారు. ఈ పరిశోధన ప్రతిపాదనలలో భాగంగా విద్యార్థులకు సరైన సూచనలు, సలహాలు ఇస్తూ ముఖ్యపాత్ర పోషించిన ఫార్మకాలజి విభాగాధిపతి డాక్టర్ పుసులూరి రాజేష్‌ను ప్రిన్సిపల్ అభినందించారు.