ANM Training Courses: కోర్సుల అవకాశం.. మహిళలకు మాత్రమే
సాక్షి ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో రెండేళ్ల ఉచిత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (స్త్రీలు)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశం కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనర్సయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 40 సీట్లు ఉన్నాయని, అభ్యర్థుల వయస్సు 31–12–2023 నాటి కి తప్పనిసరిగా 17 సంవత్సరాలు నిండి ఉండాలని, వయోపరిమితి లేదన్నారు.
Inspection at School: మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఫుడ్ కమిషన్ సభ్యుడు
ఇంటర్‌మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ఏ గ్రూపు అయినా చదివి ఉండొచ్చన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 మాత్రమేనని, ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు ఫీజు మినహాయిపు ఉందన్నారు. ప్రవేశ దరఖాస్తుల కోసం ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో సంప్రదించాలని లేదా ప్రభుత్వ వెబ్‌సైట్ http://cfw.ap.nic.inలో పూర్తి సమాచారం కోసం చూడాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా శిక్షణ కేంద్రంలో సమర్పించాలని, పూర్తి వివరాలకు 9959030873, 9059327020కు ఫోన్ చేయాలని తెలిపారు.