Medical College Inauguration: మెడికల్ కళాశాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను ఈ నెల 15న వర్చువల్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంపై సమీక్షించారు. మెడికల్ కళాశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన దాదాపు 25వేల మంది విద్యార్థులతో రేకుర్తి నుంచి కళాశాల వరకు భారీర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Andhra University: ఏయూతో రొడెంటా సంస్థ ఒప్పందం
కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నోడల్ అధికారిని నియమించాలని కలెక్టర్‌గోపికి సూచించారు. అనంతరం కళాశాల వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కళాశాలలో 100 సీట్లకుగాను ఇప్పటికే 88 విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారని, అందులో జిల్లాకు చెందిన వారు 10మంది ఉన్నారన్నారు. సీపీ సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులు ఉన్నారు.
Job Mela: నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో జాబ్ మేళా
దారి మళ్లింపు..
మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని కలెక్టర్ బి.గోపి ఒక ప్రకటనలో తెలిపారు. భారీర్యాలీ నిర్వహించనున్న తరుణంలో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జగిత్యాల నుంచి వచ్చే వాహనాలు వెలిచాల ఎక్స్‌రోడ్డు బైపాస్ నుంచి చింతకుంట, రేకుర్తి, కరీంనగర్ వెళ్లాలని సూచించారు. కరీంనగర్ నుంచి జగిత్యాల మార్గంలో వెళ్లే వాహనాలు రేకుర్తి, చింతకుంట బైపాస్, వెలిచాల ఎక్స్ రోడ్డు మీదుగా జగిత్యాల వెళ్లే విధంగా దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు.