Andhra University: ఏయూతో రొడెంటా సంస్థ ఒప్పందం
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ పరిశోధనలకు ఉపయుక్తంగా యానిమల్ హౌస్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కి చెందిన రొడెంటా బయోసర్వి సంస్థ ఏయూతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో మంగళవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, రొడెంట సంస్థ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ కె.ఆనంద్ కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వర్సిటీలో ఫార్మసీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జువాలజీతో పాటు జీవశాస్త్ర కోర్సులు అభ్యసించే పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు ఉపయుక్తంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
Job Mela Results: జాబ్ మేళాల ద్వారా ఉపాధి పొందిన నిరుద్యోగులు..
ఏయూలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలిమెంట్ భవనానికి అనుసంధానంగా.. నెల రోజుల్లో ఈ కేంద్రం పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభించనుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వర్సిటీల్లో ఇటువంటి కేంద్రం ఉండడం అరుదైన విషయమని, రెండు దశల్లో దీనిని విస్తరిస్తామన్నారు. డాక్టర్ కె.ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నగరంలోని వివిధ పరిశ్రమల అవసరాలు తీర్చుతూ ఆదాయ వనరుగా ఈ కేంద్రం నిలుస్తుందన్నారు. ఏయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్, డీన్ ఆచార్య కె.బసవయ్య, ఆచార్య ఈశ్వర కుమార్, గిరిజా శంకర్, శైలజ, మురళీకృష్ణ కుమార్ పాల్గొన్నారు.
ఒప్పందం చేసుకున్న రొడెంటా బయో సర్వి సంస్థ