100 Years Celebrations: ఘనంగా ఆంధ్రా వైద్య కళాశాల శతాబ్ధి వేడుకలు..
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రా మెడికల్ కళాశాల శతాబ్ది వేడుకలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో సినీ సంగీత దర్శకురాలు ఎం.ఎం శ్రీలేఖ, గాయకులు గీతా మాధురి, అరుణ్ కౌటిల్య, ధనుంజయ్ తదితరులు తమ గాత్రంతో హోరెత్తించారు.
➤ Talent Programs for Students: ప్రతిభను కనబరిచేందుకు 'కళతిరువిజ పోటీలు..
తెలుగు, హిందీ పాటలను పాడి వైద్య విద్యార్థులను ఉత్సాహపరిచారు. కొమరం భీముడో, యూ ఆర్ మై ఎమ్మెల్యే, ఓ సీత, బంగారు కోడి పెట్ట తదితర పాటలు ఆలపించి.. అలరించారు. గాయకులు పాడిన పాటలకు విద్యార్థులు తమదైన శైలిలో డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేశారు.
➤ International Wrestling Championship: రెజ్లర్ చాంపియన్‌షిప్ కు యువతి ఎంపిక..
ఎంపీ సత్యవతికి సన్మానం
అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతిని సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ఘన సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వందేళ్లు పూర్తి చేసుకున్న ఏఎంసీలో తాను కూడా చదువుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. తన వంతుగా ఏఎంసీ వుమెన్స్ హాస్టల్ కోసం ఎంపీ నిధుల నుంచి రూ.15లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రజలు ధైవంగా భావించే వైద్య వృత్తికి మరింత వన్నె తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.