Skip to main content

International Wrestling Championship: రెజ్ల‌ర్ చాంపియన్‌షిప్ కు యువ‌తి ఎంపిక‌..

పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో త‌న విద్యను అభ్యాసిస్తున్న యువ‌తి జిల్లా స్థాయిలో త‌న సత్తా చాటి ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో జ‌రిగే రెజ్ల‌ర్ చాంపియ‌న్ కు ఎంపికైంది.
Uma Devi receiving the trophy for winning at district level
Uma Devi receiving the trophy for winning at district level

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్రప్రదేశ్‌ యువ రెజ్లర్‌ ఉమాదేవి అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైంది. నవంబర్‌ 17న రష్యాలోని మాస్కోలో జరిగే ఈ మెగా టోర్నీలో జూనియర్‌ కేటగిరిలో 49 కిలోల విభాగం నుంచి ఆమె తలపడనుంది. బత్తలపల్లి మండలం సంగాల గ్రామానికి చెందిన దేవరకొండ నారాయణస్వామి, సరస్వతి దంపతుల కుమార్తె ఉమాదేవి ప్రస్తుతం తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడో ఏడాది చదువుతోంది. తండ్రి నారాయణస్వామి పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

➤   Reunion After 25 Years: రైల్వే హైస్కూల్ విద్యార్థులు.. పాతికేళ్ల త‌రువాత‌!

నిరుపేద కుటుంబం కావడంతో అంతర్జాతీయ పోటీలకు వెళ్లి వచ్చేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నారు. దాతలు, క్రీడాభిమానులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందజేస్తే దేశానికి మంచి పేరు తీసుకువస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. ఎవరైనా దాతలు స్పందిస్తే ఫోన్‌ ఫే (7981894274, డి.నారాయణస్వామి)కు లేదా ధర్మవరంలోని ఎస్‌బీఐ ఖాతా నంబర్‌ 32695973301 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0000250)కు నగదు బదిలీ చేసి సాయం చేయాలని ఆమె కోరుతోంది.
 

Published date : 30 Oct 2023 12:06PM

Photo Stories