Skip to main content

Medical Colleges : వైద్య క‌ళాశాల‌ల్లో క‌న్వీన‌ర్ కోటా సీట్ల కేటాయింపు.. ఈనెల 19న రిపోర్టింగ్‌..!

2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్‌ ఎంబీబీఎస్‌ కన్వినర్‌ (ఎ కేటగిరి) సీట్లను ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది.
Allotment of convenor quota mbbs seats in ap govt and private medical colleges

అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్‌ ఎంబీబీఎస్‌ కన్వినర్‌ (ఎ కేటగిరి) సీట్లను ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లో కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

Private School Teachers: ప్రైవేట్‌ స్కూళ్లలో టీచర్లపై ఆరా.. వారి అర్హతలేంటో తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌

దివ్యాంగ, మరికొన్ని ప్రత్యేక విభాగాల్లో తుది మెరిట్‌ జాబితా ఇంకా సిద్ధం కానందున ఆ విభాగాల సీట్ల వరకూ పెండింగ్‌లో ఉంచారు. మొత్తం 3,879 సీట్లకు గాను తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,507 సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక తుది మెరిట్‌ జాబితాను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, అక్టోబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Published date : 16 Sep 2024 03:04PM

Photo Stories