ఇస్రో వర్క్‌షాప్‌లో కృష్ణా వర్సిటీ విద్యార్థులు
Sakshi Education
కోనేరుసెంటర్(మచిలీపట్నం): భారతీయ అంత రిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించిన వర్క్‌షాప్‌లో కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు.
స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్నెస్, స్పేస్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్’ అంశంపై ఇస్రో ప్రధాన కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగం విద్యార్థులు నలుగురు పాల్గొన్నారు.
చదవండి: US wanted India space tech: మన అంతరిక్ష సాంకేతికతను కోరుతున్న అమెరికా
ఇందు కోసం ఇస్రో సంస్థ ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షకు రెండు వేల మంది హాజరయ్యారు. వారిలో 200 మంది విద్యార్థులను ఇస్రో సంస్థ ఎంపిక చేయగా అందులో కృష్ణా విశ్వవిద్యాలయం నుంచి కె.ప్రజ్ఞ, ఎం.జ్యోత్స్న, ఎం.ఎల్.షర్మిల, ఎస్.ఎన్.సునిత చోటు దక్కించుకున్నారు. నలుగురు విద్యార్థును విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి బుధవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ సల్మా బేగం తదితరులు పాల్గొన్నారు.
Published date : 19 Oct 2023 03:24PM