Free Training: ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
Sakshi Education
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని స్కిల్‌హబ్‌లో నవంబర్ 27వ తేదీ నుంచి ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎన్టీఆర్ జిల్లా అధికారి పి.నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు చూపిస్తామని పేర్కొన్నారు. 8, 9, 10 తరగతులతో పాటుగా ఐటీఐ, ఇంటర్, డిప్లమో, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారితో పాటుగా ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు.
చదవండి: Prof R Limbadri: టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి
18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. అర్హతలు, ఆసక్తి ఉన్న వారు నవంబర్ 27వ తేదీలోగా 83282 52829 నంబరులో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
Published date : 23 Nov 2023 01:08PM