Students Innovation projects: టాలెంట్‌తో అబ్బురపరిచిన పాలిటెక్నిక్ విద్యార్థులు
Sakshi Education
అనంతపురం: విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు ప్రోత్సహించి, వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అనంతపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన రెండు రోజుల రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024 అద్భుత ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది.
Students Innovation projects
జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురి ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. డిప్లొమా స్థాయిలోనే వినూత్న, ఆధునిక ఆవిష్కరణలు ప్రదర్శించిన విద్యార్థుల మేథాసంపత్తిని అధ్యాపకులు అభినందించారు. అబ్బురపరిచే ఆవిష్కరణలపై సర్వత్రా ప్రశంసలు దక్కాయి.