Polytechnic Courses Job Apportunities: పాలిటెక్నిక్ కోర్సుతో ఉపాధి అవకాశాలు.. ఉచితంగా స్టడీ మెటీరియల్
Sakshi Education
కుప్పంరూరల్ : పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి కాగానే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వెతుక్కుకుంటూ వస్తాయని కుప్పం పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని బాలికల పాఠశాలలో పాలిటెక్నిక్ కోర్సులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక రంగంలో పరిశ్రమలను అనుసంధానం చేస్తూ కోర్సులను బోధిస్తున్నామన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని వెల్లడించారు.
Polytechnic Courses Job Apportunities
కుప్పం కళాశాలలో ఉచిత పాలిసెట్ కోచింగ్, స్టడీ మెటీరియల్ సైతం అందిస్తున్నట్లు వివరించారు. పాలిసెట్–2025 ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను పది పాసైన, పది పరీక్షలు రాసిన విద్యార్థులు రాయవచ్చనని సూచించారు.
అనంతరం పాలిటెక్నిక్ ఎందుకు చదవాలి అనే అంశంపై తయారు చేసిన బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్‌బాబు, పాలిటెక్నిక్ అధ్యాపకులు రమేష్, హుస్సేన్ మియామి పాల్గొన్నారు.