Prof R Limbadri: టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి
అవంతి డిగ్రీ, పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలునవంబర్ 22న నాగోలులోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న లింబాద్రి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలకుపైగా అవంతి కళాశాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడం గొప్ప విషయమని కొనియాడారు.
చదవండి: Gadela Bhupati: అంతరిక్ష పరిశోధకులుగా ఎదగాలి
విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్శిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టరేట్ ప్రొఫెసర్ నగేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని సాధించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐసీఏఐ చాపర్ ఫార్మర్ చైర్మన్ పంకజ్ త్రివేది, ఎప్ట్రాయిడ్, కన్సల్టింగ్ మేనేజర్ హెచ్‌ఆర్ సౌమ్యారెడ్డి, అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఎం.ప్రియాంక, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.వీరసోమయ్య, కళాశాల డైరెక్టర్స్ డా.జయప్రద, డా.వెంకట్ రావు, ఎన్.సాయిరాం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.