ISROను సందర్శించిన బిట్స్ విద్యార్థులు
నర్సంపేట రూరల్: నర్సంపేట మండలంలోని బిట్స్ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన సుమారు 110మంది విద్యార్థులు ఇండ్రస్టీయల్ విజిట్స్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), శ్రీహరికోటను సందర్శించారు. దాదాపు 4గంటల పాటు ఇస్రోలో ఉన్న అన్ని విభాగాలను సంస్థకు చెందిన సీనియర్ సైంటిస్టులు రవి కుమార్, వైద్యనాధన్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హరిహరన్, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: ISRO's AstroSat: అంతరిక్షంలో గామా కిరణ పేలుడును గుర్తించిన ఇస్రో ఆస్ట్రోశాట్
ఇస్రో వర్క్‌షాప్‌లో కృష్ణా వర్సిటీ విద్యార్థులు
భారతీయ అంత రిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించిన వర్క్‌షాప్‌లో కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు.
స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్నెస్, స్పేస్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్’ అంశంపై ఇస్రో ప్రధాన కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగం విద్యార్థులు నలుగురు పాల్గొన్నారు.
ఇందు కోసం ఇస్రో సంస్థ ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షకు రెండు వేల మంది హాజరయ్యారు. వారిలో 200 మంది విద్యార్థులను ఇస్రో సంస్థ ఎంపిక చేయగా అందులో కృష్ణా విశ్వవిద్యాలయం నుంచి కె.ప్రజ్ఞ, ఎం.జ్యోత్స్న, ఎం.ఎల్.షర్మిల, ఎస్.ఎన్.సునిత చోటు దక్కించుకున్నారు. నలుగురు విద్యార్థును విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి బుధవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ సల్మా బేగం తదితరులు పాల్గొన్నారు.