Skip to main content

ISRO YUVIKA 2025 Applications : ఇస్రో యువికా 2025కు 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌.. ఎంపిక విధానం ఇలా..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. ఇండియ‌న్ స్పేస్ రిస‌ర్చ్ ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్ర‌మ్.. యూవికా (యువ విజ్ఞాన కార్యక్రమం).
Online registrations for isro yuvika 2025 science program  ISRO Yuvika Youth Science Program

సాక్షి ఎడ్యుకేష‌న్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. ఇండియ‌న్ స్పేస్ రిస‌ర్చ్ ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్ర‌మ్.. యూవికా (యువ విజ్ఞాన కార్యక్రమం). గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి కలిగించేందుకు ఇస్రో ప్ర‌తీ ఏటా యువికాను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్పేస్‌ టెక్నాలజీ, సైన్స్‌ అప్లికేషన్‌లపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించనున్నారు.  ఈ ప్రోగ్ర‌మ్‌కు 8వ త‌ర‌గతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అర్హులు.

TG EAPCET 2025 Notification: పూర్తి సమాచారం మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ వివరాలు

యువెకా ప్రోగ్రామ్‌కు సంబంధించిన‌ రిజిస్ట్రే ష‌న్లు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక‌, వ‌చ్చే నెల మార్చి.. 23వ తేదీ వ‌ర‌కు ఈ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కొన‌సాగ‌నుంది. ఇక‌, ఎంపికైన విద్యార్థుల‌కు మే నెల‌లో 2 వారాల పాటు స్పేస్ టెక్నాల‌జీ, సైన్స్‌లో శిక్ష‌ణ ఇస్తారు. 

ద‌ర‌ఖాస్తుల విధానం:

1. మీ ఈ మెయిల్‌తో యువికా 2025కు ద‌రఖాస్తులు చేసుకోవాలి.

2. రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌ 48 గంట‌ల్లో ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే క్విజ్‌ని పూర్తి చేయాలి.

3. క్విజ్ పూర్తి చేసుకున్న గంట అనంత‌రం, యువెకా పోర్ట‌ల్‌లోకి లాగిన్ అయ్యి, ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తుల ప్రక్రియ‌ను ప్రారంభించండి.

All Planets: మరో అద్భుతం.. ఆకాశంలో కనువిందు చేయనున్న ఏడు గ్రహాలు.. ఎప్పుడంటే..

4. మీ సంత‌కం కాపీని, అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను ఆ అప్లికేష‌న్ ఫార్మ్‌లో న‌మోదు చేసి స‌బ్మిట్ చేయండి. అప్లికేష‌న్ ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి. (భ‌విష్య‌త్తు అవ‌సారం కోసం)

ఎంపిక విధానం:

1. 8వ త‌ర‌గ‌తి విద్యాను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని, మీ నైపుణ్యాలు, ప్ర‌తిభ‌ల‌ను ప‌రిశీలిస్తారు.

2. సైన్స్ క్ల‌బ్ లేదా స్పేస్ క్ల‌బ్‌లో మీ మెంబ‌ర్ షిప్ ఉండాలి

3. పాఠశాల ఆధారిత పాఠ్యేతర కార్యకలాపాలలో బహుమతులు.

4. జిల్లా, రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ‌ స్థాయిలో స్పోర్ట్స్ ఆక్టివిటీస్‌లో విన్న‌ర్లు.

Polycet 2025: పాలీసెట్‌–2025 పరీక్ష తేదీ ఖారారు.. ఈసారి దరఖాస్తు ఫీజు ఇలా!

5. ఎన్‌సీసీ లేదా ఎన్ఎస్ఎస్‌లో మెంబ‌ర్‌షిప్‌.

6. గ్రామం/గ్రామీణ పాఠశాల విద్యార్థి

కార్య‌క్ర‌మం ల‌క్ష్యం:

ప్రాథ‌మిక‌ విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్రం, అంతరిక్ష అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం.

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్‌)లో కెరీర్‌లను కొనసాగించడానికి ఎక్కువ మంది విద్యార్థులను ప్రోత్సహించడానికి.

APPSC Group 2 Exam : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల వాయిదాపై హైకోర్టు వ్యాఖ్య‌లు..

శిక్షణ కేంద్రాలు:

ఇస్రో యువికా 2025 ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్, హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌తోపాటు దేహ్రాదూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్, బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్, షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్ వంటి వివిధ కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది. కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 22 Feb 2025 10:05AM

Photo Stories