Skip to main content

ISRO's AstroSat: అంతరిక్షంలో గామా కిరణ పేలుడును గుర్తించిన ఇస్రో ఆస్ట్రోశాట్‌

అంతరిక్షంలో జరిగిన అతి శక్తిమంతమైన గామా కిరణ పేలుడు (గామా రే బరస్ట్‌–జీఆర్బీ)ను ఇస్రో ఆస్ట్రోశాట్‌ టెలిస్కోప్‌ తాజాగా మరోసారి గుర్తించింది.
Gamma Ray Burst Detected by Astrosat, India's Space Observatory, ISRO's Astrosat Captures Record-breaking Gamma Ray Burst, ISRO's Astrosat Makes Historic Observation of Intense Gamma Ray Burst, ISRO's AstroSat telescope detects gamma ray bursts, Astrosat Telescope Observes Powerful Gamma Ray Burst in Space,
ISRO's AstroSat telescope detects gamma ray bursts

జీఆర్బీ 231122బి గా పిలుస్తున్న ఇది ఆస్ట్రోశాట్‌ గుర్తించిన 600వ పేలుడు కావడం విశేషం. ఇస్రో టెలిస్కోప్‌ సాధించిన ఈ ఘనతపై అంతర్జాతీయ అంతరిక్ష సమాజంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి.

World's Fastest Internet Network: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చైనా ఇంటర్నెట్ నెట్‌వర్క్‌

ఈ జీఆర్బీలను అంతరిక్షంలో సంభవించే అత్యంత శక్తిమంతమైన పేలుళ్లుగా చెబుతారు. ఇవి తరచూ కృష్ణబిలాల ఆవిర్భావానికి దారి తీస్తుంటాయి. అతి తక్కువ వ్యవధిలోనే, అంటే కొన్ని మిల్లీ సెకన్ల నుంచి నిమిషాల్లోపే అపరిమితమైన శక్తిని వెదజల్లడం ఈ జీఆర్బీల ప్రత్యేకత. ఈ సందర్భంగా అంతరిక్షంలో పరుచుకునే వెలుతురు మిరుమిట్లు గొలిపే స్థాయిలో ఉంటుంది. 

దుమ్ము రేపుతున్న ఆస్ట్రోశాట్‌

2015 సెప్టెంబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన తొలి మల్టీ వేవ్‌ లెంగ్త్‌ అంతరిక్ష టెలిస్కోపే ఆస్ట్రోశాట్‌. నాటినుంచి భారత అంతరిక్ష పరిశోధనలకు మూలస్తంభంగా నిలిచింది. ఇది గరిష్టంగా ఐదేళ్ల పాటు పని చేస్తుందని అంచనా వేశారు. కానీ ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటికీ అద్భుతంగా పని చేస్తూ ఇస్రో సామర్థ్యానికి తిరుగులేని ప్రతీకగా నిలిచింది.

అంతరిక్షంలో సంభవించే అరుదైన దృగ్విషయాలైన గామా పేలుళ్లను ఆస్ట్రోశాట్‌ ఇట్టే ఒడిసిపడుతూ పలు అంతర్జాతీయ పరిశోధనలకు ఆలంబనగా నిలిచింది. అదిప్పటిదాకా ఏకంగా 600 జీఆర్బీలను గుర్తించడం నిజంగా గొప్ప విషయమేనని నాసా సైంటిస్టులు అంటున్నారు. ఆస్ట్రోశాట్‌లోని కాడ్మియం జింక్‌ టెల్యురైడ్‌ ఇమేజర్‌ (సీజెడ్‌టీఐ)దే ఈ ఘనతలో ప్రధాన పాత్ర అని ఐఐటీ బాంబే పరిశోధకులు వివరించారు. హై ఎనర్జీ, వైడ్‌ ఫీల్డ్‌ ఇమేజింగ్‌ సీజెడ్‌టీఐ ప్రత్యేకత.

NASA's Snake Robot: అంతరిక్ష పరిశోధనకు స్నేక్ రోబో

Published date : 29 Nov 2023 12:38PM

Photo Stories