NASA's Snake Robot: అంతరిక్ష పరిశోధనకు స్నేక్ రోబో
సరిగ్గా పాములాగే కనిపించే ఈ రోబో ఎలాంటి ప్రతికూల ప్రదేశాలకైన ప్రయాణించగలదు. అయితే.. దీని తయారీ వెనక ఓ భారతీయ కుర్రాడి ప్రతిభ దాగి ఉంది.
DeepFake Technology: డీప్ ఫేక్ సాంకేతికతతో పెను ప్రమాదం
నాగ్‌పుర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహణ్ టక్కర్ నాసాలో పనిచేస్తున్నారు. ‘ఎగ్జోబయోలజీ ఎక్స్‌టంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్‌ఎస్)’ పేరుతో పిలుస్తున్న ఈ రోబోను టక్కర్ కనిపెట్టాడు. పైథాన్‌లా ప్రయాణించే ఈ రోబో ఎలాంటి గరుకైన ప్రదేశాలకైన వెళ్లగలదు. కొండలు, గుహల్లోనూ సునాయసంగా ప్రయాణించగలదు. ఇతర గ్రహాలపైనా జీవం పుట్టుకను కూడా ఇది అన్వేషించగలదు. విపత్తు నిర్వహణల్లోనూ ఇది ఉపయోగపడనుంది.
నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన టక్కర్.. నాసా కోసం మార్టిన్ హెలికాప్టర్‌ను రూపొందించారు. ఐఐటీ చదివిన బాబ్ బలరామ్ నుండి ప్రేరణ పొందినట్లు పంచుకున్నారు. తను ఐఐటీ సాధించడంలో విఫలమయ్యానని అయినప్పటికీ నాసాలో విజయం సాధించానని చెప్పారు.
Humane AI Pin: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే..