Skip to main content

Chandrayaan-3 : చంద్రుడి ఉపరితలం శిలాద్రవ సముద్రమేనని ధ్రువీకరించిన చంద్రయాన్‌-3

చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకప్పుడు శిలాద్రవ సముద్రమే అనే వాదనను ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ –3 డాటా సైతం ధ్రువీకరించింది.
Chandrayaan-3 confirmed that the surface of the moon is a liquid ocean

చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకప్పుడు శిలాద్రవ సముద్రమే అనే వాదనను ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ –3 డాటా సైతం ధ్రువీకరించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీతో పాటు పలు సంస్థలకు చెందిన అధ్యయనం వివరాలు ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గతంలో నాసాకు చెందిన అపోలో, సోవియెట్‌ యూనియన్‌కు చెందిన లూనా చంద్రుడి నాడీమండల, మధ్య అక్షాంశ ప్రాంతాల నమూనాలను సేకరించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత చంద్రుడిపై ఒకప్పుడు శిలాద్రవం ఉండేదనే అభిప్రాయానికి శాస్త్రవేత్తలు వచ్చారు.

Modi Visit European: రెండు రోజులు పోలెండ్‌లో పర్యటించిన మోదీ.. వినూత్న విదేశాంగ విధానం

అయితే, చంద్రయాన్‌–3లో భాగంగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ మాత్రం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి డాటాను పంపించింది. ఈ డాటాను అధ్యయనం చేసిన పరిశోధకులు దక్షిణ ధ్రువంపై కూడా శిలాద్రవమే ఉండేదని గుర్తించారు. అంతేకాదు, చంద్రుడి ఉపరితలం మొత్తం ఫెర్రోన్‌ అనార్థో సైట్‌ (ఎఫ్‌ఏఎన్‌ ) అనే ఒకే రకమైన రాయితో ఏర్పడిందని సైతం పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తల ఊహిస్తున్న దాని ప్రకారం.. రెండు ప్రోటోప్లానెట్లు ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడు. ఫలితంగా చంద్రుడు చాలా వేడిగా మారిపోయాడని, వేడికి ఉపరితలం కరిగి శిలాద్రవ సముద్రంగా మారిందని పరిశోధకులు తెలిపారు.

Gender Equality: వర్ణ వివక్షపై పోరాడిన నేలలో లింగ వివక్ష..!

Published date : 26 Aug 2024 02:26PM

Photo Stories