Second phase of counselling: సెప్టెంబర్ 15న హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సు రెండో విడత కౌన్సెలింగ్
Sakshi Education
ఓయూలో సెప్టెంబర్ 12న మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎండీహెచ్‌ఎం) కోర్సులో ప్రవేశానికి రెండో విడత కౌన్సెలింగ్ జరగనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండు రంగారెడ్డి సోమవారం తెలిపారు.
అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్మి్రస్టేషన్, దక్కన్ స్కూల్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో గల సీట్ల భర్తీకి ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమగు రెండో విడత కౌన్సెలింగ్‌కు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన లోకల్, నాన్‌లోకల్ అభ్యర్థులు హాజరుకావాలని కనీ్వనర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్‌లో చూడవచ్చు.
Also read: 5043 Jobs in Food Corporation of India: నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ టిప్స్...
Published date : 13 Sep 2022 06:32PM