IIMV-CRME: ఐఐఎం విశాఖలో సీఆర్‌ఎంఈ ప్రారంభం
Sakshi Education
ఏయూక్యాంపస్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం ప్రాంగణంలో సెంటర్ ఫర్ రెస్పాన్స్‌బుల్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌ను మార్చి 28న ప్రారంభించారు.
![IIMV-CRME](/sites/default/files/images/2024/03/29/iimv-crme-1711706412.jpg)
ఈ కేంద్రాన్ని ఏకం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అమిత్ చటర్జీ, ఆచార్య బి.చక్రవర్తి, విర్హాద్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డి.శ్రీ ప్రసాద్, ఐఐఎం సంచాలకులు ఆచార్య ఎం.చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకం ఫౌండేషన్ ట్రస్టీ అమిత్ చటర్జీ మాట్లాడుతూ బాధ్యత కలిగిన మేనేజర్లను తయారు చేస్తే మంచి నాయకులుగా నిలుస్తారన్నారు.
చదవండి: IIM Vizag: ఐఐఎం వైజాగ్‌కు అరుదైన అవార్డు
విర్హాద్ ఎండీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలకు ఉపయుక్తంగా నిలిచే సూచనలు అందిస్తూ వారికి తోడ్పాటును అందించే విధంగా కేంద్రం నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆచార్య చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యావరణం, సామాజిక, పరిపాలన నిర్ణయాలను మేనేజ్‌మెంట్ విద్యలో భాగం చేస్తుందన్నారు. కేంద్రం అధిపతి ఆచార్య అమిత్ చక్రవర్తి తదితరులు ప్రసంగించారు.
Published date : 29 Mar 2024 03:30PM