25, 000 Jobs, మెగా జాబ్‌మేళా.. 147 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు..
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో విస్తృత ఉద్యోగాల కల్పన కోసం.. అభివృద్ధి వికేంద్రీకరణ మేరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న ఈ మెగా జాబ్‌మేళాల ద్వారా 25 వేలమందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 16, 17తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను ఏప్రిల్ 15న ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా యువత కోసం వైఎస్సార్‌సీపీ జాతీయ, అంతర్జాతీయంగా పేరుగాంచిన 147 కంపెనీలను పిలిపించి జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ మేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా 1.47 లక్షల మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 16, 17తేదీలలో తిరుపతిలోను, 23, 24 తేదీల్లో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో, ఏప్రిల్ 30, మే 1వ తేదీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఈమేళాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఏప్రిల్ 16న తిరుపతి, వైఎస్సార్, రాజంపేట, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు, ఏప్రిల్ 17న అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల వారు ఈమేళాలో పాల్గొనాలని సూచించారు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అయి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చినవారు మాత్రమే హాజరుకావాలన్నారు. తిరుపతిలో నిర్వహించే జాబ్‌మేళాకు 40 వేలమందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.
చదవండి:
Top Companies: ఉద్యోగులకు దేశంలో బెస్ట్ కంపెనీలు ఎవో తెలుసుకోండిలా..
Central Government Jobs: ఎంబీబీఎస్‌తో.. కేంద్రంలో వైద్య కొలువు
BC Study Circle: పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు.. దరఖాస్తుల గడువు పెంపు
Government Jobs : గుడ్‌న్యూస్.. 3,334 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే..
మూడేళ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 6 లక్షలకుపైగా ఉద్యోగాలు
ఉద్యోగాల కల్పనలో ఏపీ ముందంజలో ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే ఆరులక్షలకుపైగా ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనన్నారు. 2.50 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఆర్టీసీలోని 52 వేలమంది ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నారని, 2.60 లక్షల వలంటీర్ల పోస్టులు ఇచ్చారని, ఆప్కోస్ ద్వారా 95 వేలమందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పిస్తూ 75% మంది స్థానికులకే ఉద్యోగాలను అందించేందుకే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. మూడేళ్లలో 30 సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందని చెప్పారు.