Skip to main content

Mega Job Mela: 11, 12 తేదీల్లో జాబ్‌మేళా

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలోని 40 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఆగ‌స్టు 11, 12 తేదీల్లో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.
Mega Job Mela
11, 12 తేదీల్లో జాబ్‌మేళా

స్థానిక ఆర్ట్స్‌ కళాశాలో జరిగే ఈ జాబ్‌మేళాకు సంబంధించి దిశా నిర్దేశం చేసేందుకు ఆయన ఆగ‌స్టు 4న‌ కళాశాలకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఈ మేళా 17 రంగాలకు చెందిన స్కిల్‌ సెక్టార్‌ కౌన్సిల్స్‌ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

చదవండి: SSC CHSL Notification 2023: కేంద్రంలో 1600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

దీనిద్వారా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దీనిపై ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌, ప్లేస్‌మెంట్‌ అధికారులు నూరు శాతం విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉన్నత విద్యా కమిషనర్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి డాక్టర్‌ అనిల్‌, సుధాకర్‌, 40 కళాశాలల ప్లేస్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.
చదవండి: SSC Notification 2023: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి... జాబ్‌ కొట్టండి

Published date : 05 Aug 2023 03:16PM

Photo Stories