School Education Department: ‘ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సేవలు వినియోగించుకోండి’
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలు సాధించే దిశగా అధికారులు కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు.
ఇందుకోసం ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌ల సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ జూన్ 18న కలెక్టర్లు, డీఈవోలకు లేఖ రాశారు.
చదవండి: Andhra Pradesh: అమ్మఒడి అమలుకు మార్గదర్శకాలు
‘జగనన్న గోరుముద్ద’, విద్యాకానుక అమలు, 100% విద్యార్థుల హాజరు నమోదు, పాఠశాలల నిర్వహణకు సచివాలయాల్లోని 10వేల మంది విద్యాసహాయకుల సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
Published date : 19 Jun 2023 03:22PM