Skip to main content

Skill Training: విదేశాల్లోనూ ఉపాధికి ‘స్కిల్‌’ శిక్షణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ముందడుగు వేసింది.
Skill Training
విదేశాల్లోనూ ఉపాధికి ‘స్కిల్‌’ శిక్షణ

మిడిల్‌ ఈస్ట్, యూరప్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా తదితర దేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా మార్చి 23న తాడేపల్లిలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో టీఏకేటీ గ్రూప్‌తో ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఏపీఎన్‌ఆరీ్టఎస్‌ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ, ఏపీఎన్‌ఆర్టిఎస్‌ సీఈవో వెంకట్‌ ఎస్‌ మేడపాటి, టీఏకేటీ గ్రూప్‌ ఎండీ రాజ్‌సింగ్‌ సమక్షంలో పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

చదవండి: Study Abroad: విదేశీ విద్యకు.. ముందస్తు ప్రణాళిక!

ఈ ఒప్పందం ద్వారా వైద్యం, నిర్మాణం, ఆతిథ్య రంగాల్లోని విదేశీ అవకాశాలపై టీఏకేటీ గ్రూప్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తొలి దశలో జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు 15 మంది నర్సింగ్‌ అభ్యర్థులను ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. వీరికి జర్మనీ భాషపై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో జర్మనీకి పంపిస్తారు. అలాగే సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు 192 స్కిల్‌ హబ్స్, 26 స్కిల్‌ కాలేజీలు, స్కిల్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 

చదవండి: US Visa: ఇలా చేస్తే ఈజీగా అమెరికాకి వెళ్లొచ్చు... కొత్త నిబంధ‌న‌లు తెలుసా?

Published date : 24 Mar 2023 05:00PM

Photo Stories