Sports: స్కేటింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
Sakshi Education
అద్దంకి రూరల్: జిల్లా స్కూల్ క్యాంపస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలకు అక్టోబర్ 31న స్థానిక మార్కెటింగ్ యార్డులో ఎంపిక నిర్వహించారు.
ఈ పోటీలకు వివిధ వయస్సులవారు 75 మంది క్రీడాకారులు హాజరుకాగా వారిలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎస్‌జీఎఫ్ బాపట్ల సెక్రటరీ విష్ణుప్రసాద్ తెలిపారు.
చదవండి: National Games 2023: జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం
కార్యక్రమంలో జిల్లా రోలర్ స్కేటింగ్ సెక్రటరీ జాస్టి కిరణ్, ఓలంపియన్ స్పోర్స్ అకాడమీ ప్రతినిధులు ఆదిత్య, కోచ్ టీవీ పవన్‌కుమార్, ఎస్‌కె. అబ్దుల్ లతీఫ్, పర్చూరు నియోజకవర్గ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పీ. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Published date : 01 Nov 2023 01:33PM