School Education Department: మోగిన బడి గంట.. తొలిరోజు ఇంత శాతం హాజరు నమోదు
ఈ నేపథ్యంలో.. అన్ని పాఠశాలల్లోను అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు.. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 43 లక్ష మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం సిద్ధంచేసిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సోమవారం అన్ని పాఠశాలల్లోను ప్రారంభించారు.
చదవండి: 10th Advanced Supplementary: పరీక్ష తేదీలు ఇవే..
అలాగే, గతంలో పాఠశాలలు తెరిచిన తొలిరోజు 30 శాతం దాటని హాజరు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజే 57 శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో 61 శాతం మందికి విద్యా కానుక కిట్లను అందించారు. రెండోరోజు మంగళవారం నుంచి కిట్ల పంపిణీని వేగవంతం చేసి వారం రోజుల్లో మొత్తం పంపిణీని పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక అన్ని పాఠశాలల్లోను ఉ.8.30–9.00గంటల మధ్య విద్యార్థులకు రాగిజావ.. 11.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.