School Holidays 2023 : గుడ్‌న్యూస్.. స్కూల్స్‌కు మార్చి 9వ తేదీన (గురువారం) కూడా సెలవే..! కారణం ఇదే..
ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను మార్చి 8వ తేదీన (బుధవారం) ఉదయం విడుదల చేసింది.హోలీ పండుగ సందర్భంగా ఇప్పటికే మార్చి 7, 8న రెండు రోజులపాటు సెలవులు ఇచ్చింది యూపీ ప్రభుత్వం. అయితే పండుగ బాగా జరుపుకొనేందుకు మరో రోజు కూడా కావాలనే డిమాండ్ రావడంతో అందుకు తగ్గట్టే మూడో రోజు కూడా హాలిడే ఇస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. యూపీ బేసిక్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
Schools and Colleges Holiday 2023 : మార్చి నెలలో స్కూళ్లు, కాలేజీలకు 8 రోజులు సెలవులు.. ఎలా అంటే..?
➤ AP & TS Schools Summer Holidays 2023 : ఏపీ, తెలంగాణ స్కూల్స్‌కు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..?
స్కూళ్లకు మూడు రోజులపాటు...
ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, 12వ తరగతి పరీక్షలు మార్చి 3,4 తేదీల్లో ముగిశాయి. మే నెలలో ఫలితాలు ప్రకటిస్తారు. అయితే తేదీపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు ఈ ఏడాది హోలీని మహారాష్ట్రలో 6,7 తేదీల్లో జరుపుకోగా.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాత్రం 7,8 తేదీల్లో జరుపుకొన్నారు. అలాగే తెలంగాణలో కూడా 7వ తేదీన పాఠశాలకు సెలవు ఇచ్చిన విషయం తెల్సిందే. ఒక్క యూపీ ప్రభుత్వమే హోలీ సందర్బంగా స్కూళ్లకు మూడు రోజులపాటు సెలవులు ఇచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు. మరో రోజు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
➤ TS Half Day Schools 2023 : ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈ సారి భారీగానే వేసవి సెలవులు..
➤ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్