టాప్ 50 వర్సిటీల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన
2023 –24 నుంచి టాప్ 50 ర్యాంక్‌ల్లో నిలిచిన ఉన్నత విద్యాసంస్ధల్లో 21 సబ్జెక్టులకు విదేశీ విద్యా దీవెన వర్తిస్తుంది. జ్ఞానభూమి పోర్టల్‌లో టాప్ 50 ర్యాంకులు సాధించిన వాటి జాబితాను ప్రకటిస్తారు. ఆ జాబితాలోని టాప్ 50 సంస్థల్లో 21 సబ్జెక్టుల్లో అడ్మిషన్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నూరు శాతం లేదా రూ.1.25 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్ చేయనున్నట్లు తెలిపారు.
ఇతర విద్యార్థులకు నూరు శాతం లేదా రూ.కోటి వరకు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 50 ర్యాంకులు పొందిన విదేశాల్లోని ఉన్నత విద్యా సంస్థల జాబితాను జ్ఞానభూమి పోర్టల్‌లో ఏటా ప్రకటిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ప్రయోజనం పొందిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు లబ్ధి కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
చదవండి: Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..