Skip to main content

Jagananna Videshi Vidya Deevena : జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా .. రూ.కోటి వరకు 100% ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య నభ్యసించేలా ఆర్థిక సాయం అందించే జగనన్న విదేశీ విద్యా దీవెన అమలుకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు.

ఈ ఏడాది టాప్‌ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మందికి మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు.

AP YS Jagan : విద్యాశాఖపై సీఎం జగన్‌ కీలక స‌మావేశం.. జగనన్న విద్యాకానుకను..

జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా.

jagananna videshi vidya deevena

నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్‌ 200 యూనివర్సిటీల ఎంపిక చేతురు. టాప్‌ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ.కోటి వరకు 100% ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 100 – 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100% ట్యూషన్‌ ఫీజు గరిష్టంగా రూ.75 లక్షల వరకు రీయిబర్స్‌మెంట్‌ చేస్తారు. మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.50 లక్షలు లేదా ట్యూషన్‌ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు.  విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా చార్జీలను సైతం ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తోంది.

Published date : 03 Feb 2023 12:40PM

Photo Stories