ఉన్నత విద్యలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు
కేబీఎన్ కళాశాల ఆధ్వర్యంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు, సింగిల్ మేజర్ సబ్జెక్ట్ తదితర అంశాలపై అవగాహన సదస్సును జూన్ 23న సాయంత్రం నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన ఆచార్య రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల విద్యావిధానంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు కొనసాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో భాగంగా మన రాష్ట్రంలో కూడా నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల ప్రారంభంతో పాటుగా సింగిల్ మేజర్ సబ్జెక్ట్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. అంతేకాక విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు మన ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను ప్రవేశ పెడుతున్నామన్నారు.
చదవండి:
Degree: యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
TAFRC: త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!.. కారణం ఇదే
Disaster Management Authority: ట్రైనీ ఐఏఎస్‌లకు విపత్తుల నిర్వహణపై శిక్షణ
నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఇలా..
గతంలో డిగ్రీ కోర్సులో మూడు సబ్జెక్ట్‌లపై తప్పనిసరిగా పట్టు సాధిస్తేనే మార్కులు ఉండేవన్నారు. కానీ నేడు విద్యార్థి తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌ను ఎన్నుకొని అందులో పట్టు సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. మిగిలిన మైనర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. విద్యార్థి మేజర్ సబ్జెక్ట్‌లో కానీ, మైనర్ సబ్జెక్ట్‌లో గానీ పరిశోధనా రంగంలోకి ప్రవేశించవచ్చని వివరించారు. దీనిపై విద్యార్థులు మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. అలాగే విద్యార్థులు తమ డిగ్రీ కోర్సు కొనసాగిస్తున్న కాలంలో అనేక నైపుణ్యాలపై పట్టు సాధించేందుకు ఆన్‌లైన్ కోర్సులను పూర్తి చేయాలని, అవి విద్యార్థి ఉపాధి అవకాశాలకు అండగా ఉంటాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. నారాయణరావు అధ్యక్ష వహించారు. కార్యదర్శి తూని కుంట్ల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, పీఎల్ రమేష్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.