Disaster Management Authority: ట్రైనీ ఐఏఎస్‌లకు విపత్తుల నిర్వహణపై శిక్షణ
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రాబోయే 10 సంవత్సరాల్లో అధికారుల అవసరాల ఆధారంగా ‘విపత్తుల నిర్వహణ’ గురించి వారికి వివరించారు. విపత్తుల సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో ఏపీ ముందుందని తెలిపారు. విపత్తుల సంస్థ నిర్మాణం, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ, ప్రతిస్పందన బృందాలు, నిధుల జారీ, విపత్తుల నష్టాల గణన వంటి అంశాలపై వివరించారు. విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో సవాళ్లను అర్ధం చేసుకుని ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు, ప్రణాళికలు అమలు చేస్తూ, హెచ్చరికలు జారీచేస్తూ ప్రాణ, ఆస్తి నష్టాల్ని తగ్గించాలన్నారు.
అనంతరం అసిస్టెంట్ కలెక్టర్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను సందర్శించారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేసే విధానం, అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్ ఫోన్స్, శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్ టెక్నాలజీ, రెస్క్యూ టీమ్ వాడే పరికరాలను ప్రత్యక్షంగా చూపించి వివరించారు. ఐఏఎస్ అధికారులు బి.సహదిత్ వెంకట్ త్రివాంగ్, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, కల్పశ్రీ కె.ఆర్, కుశల్ జైన్, మంత్రిమౌర్య భరద్వాజ్, రాఘవేంద్ర మీనా, శౌర్యమాన్ పటేల్, తిరుమని శ్రీపూజ, వి.సంజన సింహా, విపత్తుల సంస్థ ఈడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.