Skip to main content

Guest Lecturers: వేతనం పెంపు

రాష్ట్రంలోని Guest Lecturer వేతనాలు గంటకు రూ.300 నుంచి 390 వరకూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Guest Lecturers
గెస్ట్ లెక్చరర్ వేతనం పెంపు

ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి Ronald Ross జూన్‌ 9న ఉత్తర్వులు జారీచేశారు. నెలకు 72 గంటలపాటు బోధించే అవకాశం కల్పించాలని, నెలసరి వేతనం రూ. 28,080కి పరిమితం చేయాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో దాదాపు 2 వేలమంది గెస్ట్‌ లెక్చరర్లు ఉన్నారు. వేతనం పెంపు నిర్ణయం పట్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల గెస్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

చదవండి:

Published date : 10 Jun 2022 04:01PM

Photo Stories