ఆర్థిక స్వావలంబనకు ‘హునార్’ ఆన్‌లైన్ కోర్సులు
Sakshi Education
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఆన్‌లైన్ ద్వారా సాంకేతిక నైపుణ్య శిక్షణ అందిస్తున్న ‘హునార్’ వర్చువల్ పద్ధతిలో స్నాతకోత్సవాన్ని నిర్వహించింది.
జూన్ 21న జరిగిన ఈ వేడుకల్లో దేశంలోని వందకుపైగా పట్టణాల నుంచి 6వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ‘Skill to Success’ పేరిట పది మంది విద్యార్థులకు రూ.లక్ష చొప్పున హునార్ అందజేసింది. తాము నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కోర్సులకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నట్లు Nishtha Yogesh - Founder and CEO - Hunar ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలోని గృహిణులు, యువతులు, ఉద్యోగినుల కోసం 30కి పైగా సృజనాత్మక కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తుండగా, దేశ వ్యాప్తంగా 30వేలకు పైగా ఈ కోర్సుల్లో నమోదు చేసుకున్నారని వెల్లడించారు.
చదవండి:
Published date : 22 Jun 2022 05:55PM