Skip to main content

Online Education: ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకులకు ఆన్‌లైన్‌ శిక్షణ

Online training for faculty in higher education
Online training for faculty in higher education

బంజారాహిల్స్‌: సెంటర్‌ ఫర్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, కామన్‌వెల్త్‌ ఎడ్యుకేషనల్‌ మీడియా సెంటర్‌ ఫర్‌ ఆసియా న్యూఢిల్లీ సంయుక్తంగా రూపొందించిన ఆన్‌లైన్‌ కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌ను సోమవారం అంబేడ్కర్‌ వర్సిటీ ఉపకులపతి కె.సీతారామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉన్నత విద్యావిధానంలో కోవిడ్‌ మహమ్మారి కారణంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. అధ్యాపకులకు సరికొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన పరిస్థితి కలి్పంచిందన్నారు. కార్యక్రమంలో మానస్‌ రంజన్,  ప్రొఫెసర్‌ మల్లేశ్, రామకృష్ణ పాల్గొన్నారు. 

Published date : 15 Mar 2022 04:00PM

Photo Stories