Skip to main content

నర్సింగ్, మిడ్‌వైఫరీ పరీక్షలు తేదీలు ఇవే..

సాక్షి, అమరావతి: డిసెంబర్‌లో జరగాల్సిన జనరల్‌ నర్సింగ్, మిడ్‌వైఫరీ పరీక్షలను 2023 జనవరిలో నిర్వహించనున్నారు.
Dates for Nursing and Midwifery Exams
నర్సింగ్, మిడ్‌వైఫరీ పరీక్షలు తేదీలు ఇవే..

రివైజ్డ్‌ పరీక్షల షెడ్యూల్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ డిసెంబర్‌ 22న విడుదల చేశారు. జనవరి 23–ఫిబ్రవరి 1 మధ్య థియరీ పరీక్షలు, ఫిబ్రవరి 2–10 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.300, రెండో సంవత్సరానికి రూ.400, మూడో సంవత్సరానికి రూ.500 చొప్పున పరీక్షల ఫీజును జనవరి 6లోగా చెల్లించాలి. గడువు అనంతరం 9వ తేదీ వరకు రూ.100 అపరాధ రుస/ముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

చదవండి: 

Department of Medicine: నర్సింగ్‌ అడ్మిషన్‌ల గడువు పొడిగింపు

YS Jagan Mohan Reddy: నర్సింగ్‌ విద్యార్థులకు..జర్మనీలో అవకాశాలు కల్పించండి

Published date : 23 Dec 2022 05:08PM

Photo Stories