DME: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ కోర్సులకు దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లలో 2023–24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వా నిస్తోంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 16 వరకు అందుబాటులో ఉంటుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను ప్రభుత్వ స్కూళ్లలో సెప్టెంబర్ 19 లోగా, ప్రైవేటు స్కూళ్లలో అక్టోబర్ 10వ తేదీలోగా సమర్పించాలని పేర్కొంది. తర గతులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. వివరాల కోసం http://dme.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
చదవండి:
Staff Nurse Jobs : స్టాఫ్ నర్సు ఉద్యోగం పేరిట టోకరా
Skill Development and Training Department: జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు 150 మంది ఎంపిక
Published date : 07 Sep 2023 12:48PM